ETV Bharat / state

హంపి శ్రీ హనుమాద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తితిదే ప్రత్యుత్తరం

హంపి శ్రీ హనుమాద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తితిదే ప్రత్యుత్తరం రాసింది. సరైన ఆధారాలతోనే హనుమాన్​ జన్మస్థలం ప్రకటించామని వెల్లడించింది. ప్రత్యుత్తరంతో కమిటీ సేకరించిన వివరాలను జతచేసింది.

హంపి శ్రీ హనుమాద్ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టుకు తితిదే ప్రత్యుత్తరం

author img

By

Published : May 8, 2021, 10:01 PM IST

శ్రీ హ‌నుమ‌ద్‌ జ‌న్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తితిదే ప్రత్యుత్తరం పంపింది. అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా తితిదే ప్రకటించడాన్ని హంపికి చెందిన శ్రీహనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తప్పు పడుతూ తితిదేకు లేఖ పంపింది. లేఖపై స్పందించిన తితిదే.. హనుమంతుని జన్మస్థలాన్ని ప్రకటించేందుకు ముందు తగిన ఆధారాలను సేకరించామని.. కమిటీ సేకరించిన తగిన ఆధారాలతోనే ప్రకటించామని ప్రత్యుత్తరంలో తెలిపింది. శ్రీ హ‌నుమ‌ద్‌ జ‌న్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు రాసిన లేఖలోని వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తితిదే.. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని కోరింది. ఈ నెల 20లోపు హనుమంతుని జన్మస్థలాన్ని నిర్థారించే ఆధారాలను పంపాలని తెలిపింది. కరోనా తీవ్రత తగ్గాక చర్చకు ఆహ్వానిస్తామని ప్రత్యుత్తరంలో పేర్కొంది.

ఇదీ చదవండి:

జగన్ కంటే.. జార్ఖండ్ సీఎం ఎంతో పరిణతి కలవారు: జేఎంఎం

ఆపరేషన్ సక్సెస్: తల్లి వద్దకు చిరుత కూన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.