ETV Bharat / state

దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా.. చిత్తూరు జిల్లాలో ర్యాలీలు - దిల్లీ ఉద్యమానికి మద్దతుగా చిత్తూరులో ట్రాక్టర్ల ర్యాలీ

దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతులు, విద్యార్థులు ట్రాక్టర్, బైక్ ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టగా .. అనుమతి లేదంటూ పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు.

rallys
దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు
author img

By

Published : Jan 26, 2021, 7:05 PM IST

సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.

శ్రీకాళహస్తిలో..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్ ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. స్కిట్ కళాశాల నుంచి ఆర్టీసీ కూడలి వరకు సుమారు 60 ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. నల్ల చట్టాలను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

చంద్రగిరిలో..

దిల్లీలో రైతులకు మద్దతుగా .. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో రైతు, విద్యార్థి సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించారు . మండలంలోని భీమవరం నుంచి నారావారిపల్లి మీదగా రంగంపేట వరకు రైతులు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీపై స్థానిక రైతులకు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి: 'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.