చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం పాపేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేసు గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో రూ. 1.5 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు.. రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. బాధితుడిని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు.
పీలేరులోని ప్రకాశం రోడ్డులో జరిగిన మరో అగ్ని ప్రమాదంలో.. నూరుళ్ల అనే వ్యక్తి గృహం దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో సామాగ్రి కాలిపోగా.. రూ. 2 లక్షల నష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇదీ చదవండి: