చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తప్పిపోయిన బాలుడిని పోలీసులు సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు తాలూకా, హతిమంజేరి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, మహాలక్ష్మీ దంపతులు. వీరు తమ కుమారుడు హర్షవర్థన్‌తో కలసి ఆదివారం చంద్రగిరి సమీపంలోని వెంకటంపేటలో తమ బంధువుల ఇంటికి వచ్చారు. సోమవారం ఆడుకుంటూ హర్షవర్థన్ తప్పి పోయాడు. కోట దారిలో ఏడుస్తూ కనిపించిన బాలుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలుడు తమిళం మాట్లాడుతూ ఉండటంతో స్థానికంగా ఉన్న తమిలియన్స్ని విచారించి వివరాలు సేకరించారు. చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్ఐ రామకృష్ణ బాలున్ని వారికి అప్పగించారు.
ఇదీ చూడండి: అటవీ ప్రాంతంలో తప్పిపోయిన యువకులను రక్షించిన పోలీసులు