హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీళ్ళు తీసుకురావాలని కోరుతూ తెదేపా చేపట్టిన మహా పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రామకుప్పం మండలం నుంచి మహాపాదయాత్ర నిర్వహించేందుకు నేతలు సిద్దం కాగా వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. జిల్లాలోని పడమటి మండలాల్లో తెదేపా నేతలను గృహనిర్భంధం చేశారు. పాదయాత్రలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ మంత్రి అమర్నానాథ్ రెడ్డిని పలమనేరులో గృహనిర్భంధం చేయగా.., కుప్పంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పుంగనూరు నియోజకవర్గ నాయకులు అనీషారెడ్డి, శ్రీనాథ్రెడ్డిలను పోలీసులు గృహనిర్భంధం చేశారు. తెదేపా నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు...ర్యాలీలు, పాదయాత్రలు చేయరాదని ఆంక్షలు విధించారు. రైతులకు సాగునీరు అందించడం కోసం చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవటాన్ని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు
ఇదీ చదవండి