ETV Bharat / state

'తెదేపాకి కులం లేదనడానికి ఆయనే నిదర్శనం' - tdp leader singarikunta anjireddy

చిత్తూరు జిల్లా సింగరికుంట గ్రామానికి చెందిన తెదేపా సైనికుడు అంజిరెడ్డి... గుండె ధైర్యానికి వృద్ధాప్యం అడ్డురాదని నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆయన సాహసం తెదేపా శ్రేణుల్లోనే కాకుండా 5 కోట్ల ఆంధ్రుల్లో ధైర్యం నింపిందని పేర్కొన్నారు.

తెదేపాకి కులం లేదనడానికి అతడు నిదర్శనం
తెదేపాకి కులం లేదనడానికి అతడు నిదర్శనం
author img

By

Published : Mar 17, 2020, 1:02 PM IST

తెదేపాకి కులం లేదనడానికి అతడు నిదర్శనం

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సింగరికుంట గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు అంజిరెడ్డి.. గుండె ధైర్యానికి వృద్ధాప్యం అడ్డురాదని నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పౌరుషానికి, రోషానికి వయసుతో నిమిత్తం లేదని.. దమ్ముంటే చాలని పేర్కొన్నారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న అంజిరెడ్డిపై వైకాపా శ్రేణులు మూకుమ్మడిగా దాడిచేసినా... ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దౌర్జన్యాన్ని ధిక్కరించి, ధైర్యంగా ఎదురు నిలిచి తొడగొట్టారని తెలిపారు. అంజిరెడ్డి సాహసం తెదేపా శ్రేణుల్లోనే కాకుండా 5 కోట్ల ఆంధ్రుల్లో ధైర్యం నింపిందని పేర్కొన్నారు. ఊరూరా ఎన్నికల అక్రమాలు చేసి, తిరిగి ఎన్నికల కమిషనర్​కే కులం అంటగట్టిన వాళ్లు...అంజిరెడ్డికి ఏ కులం అంటగడతారని వైకాపా నాయకులను ప్రశ్నించారు. తెదేపాకి కులం లేదు అనడానికి అంజిరెడ్డి నిదర్శనమని చంద్రబాబు కొనియాడారు.

ఇదీ చూడండి:

'కదిరిలో తెదేపా కార్యకర్తలపై దాడి అమానుషం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.