చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం దొమ్మరిపాలెంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు, నిందితులకు పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 3 నెలల క్రితం వివాదం జరిగింది. దీనిపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. అప్పటి నుంచి రగులుతూ వచ్చిన వివాదం ఘర్షణకు దారి తీసింది.
ప్రత్యర్థుల దాడిలో వెంకటేశ్ చనిపోయాడు. రూరల్ సీఐ విజయ్ కుమార్ ప్రత్యర్థులకు కొమ్ము కాశారని.. అందుకే తన భర్తను హత్య చేయగలిగారని మృతుని భార్య ఆరోపించింది. దీనిపై పట్టణ సీఐ ఆరోహణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి...