చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులను... రుయాకు తరలించటంలో పోలీసుల మధ్య ఉన్న సమన్వయ లోపం తీవ్ర జాప్యానికి కారణమవుతోంది. ఇద్దరు కుమార్తెలను మూఢ నమ్మకాలతో హత్య చేసిన కేసులో నిందితులైన తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తలంకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మదనపల్లె సబ్‌జైలుకు నిందితులను తరలించగా... బుధవారం వారికి జైలులో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆ ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రిలోని సైకియాట్రీ విభాగానికి తరలించాలని వైద్యులు సూచించారు.
నిందితుల మానసిక సమస్యల దృష్ట్యా వారిని సైకియాట్రీ విభాగానికి తరలించాలని వైద్యులు నిన్ననే సూచించినా... ఇప్పటి వరకు ఆ ఏర్పాట్లు ముందుకు సాగలేదు. ఆ ఇద్దరి భద్రత విషయంపై ఆలోచించిన సబ్ జైలు అధికారులు.. చిత్తూరు నుంచి ప్రత్యేకంగా ఏఆర్ సిబ్బందిని పిలిపించారు. ఈరోజు ఏఆర్ బృందం మదనపల్లెకు చేరుకున్నప్పటికీ.. వచ్చిన సిబ్బందిలో మహిళా కానిస్టేబుల్ లేకపోవటంతో తరలింపు వాయిదా పడింది. మహిళా కానిస్టేబుల్ని కేటాయించాలని జైలు అధికారులు మదనపల్లె తాలూకా పోలీసులను కోరినా.. ఇప్పటికీ సిబ్బంది స్పందించలేదు. ఈ కారణంగా.. నిందితుల తరలింపు ఆలస్యమవుతోంది.
ఇదీ చదవండి: