ETV Bharat / state

కలెక్టర్ , ఎస్పీలకు ఎమ్మెల్యే రోజా అభినందనలు - నగరి ఎమ్మెల్యే తాజా వార్తలు

ప్రాణాంతకమైన కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్​ పర్సన్ ఆర్కే రోజా ఆరోపించారు. నగరి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను చిత్తూరు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు.

nagari mla rk roja
కలెక్టర్ , ఎస్పీలకు ఎమ్మెల్యే రోజా అభినందనలు
author img

By

Published : May 12, 2020, 10:36 AM IST

కరోనా వైరస్ నివారణ చర్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్ర బృందం పేర్కొందని ఎమ్మెల్యే రోజా అన్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి పరిపాలనతో పాటు ఆయన విజన్ గొప్పదని పేర్కొన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకురావడం గొప్ప విషయమన్నారు. తమిళనాడు సరిహద్దులో ఉన్న నగరి నియోజకవర్గంలో కూడా కరోన వ్యాప్తి చెందకుండా కట్టడి చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ , ఎస్పీల చర్యలను ఆమె అభినందించారు. విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ సంఘటనలో ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు ఏ రాష్ట్రంలో ఇంతవరకు తీసుకోలేదన్న ఆమె బాధితుల కుటుంబాలకు తానున్నానంటూ భరోసా ఇచ్చారన్నారు.

ఇవీ చూడండి...

భక్తుల దర్శనానికి సిద్ధమవుతున్న కాణిపాకం ఆలయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.