Minister Roja Played Kabaddi: చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో మంత్రి ఆర్.కె. రోజా జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులతో కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. ఈ పోటీలో జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం క్రికెట్, ఫుట్బాల్ పోటీలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప జేసీ వెంకటేశ్వర్, డీఈఓలు విజయేంద్ర, శేఖర్, ఆర్డీఓ సృజన, ఎమ్మార్వో చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి, సెట్విన్ సీఈవో మురళీకృష్ణ, మేనేజర్ మురళిలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: