తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఏకాంతంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం శాస్త్రోక్తంగా జరిగింది.
తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల పత్రాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించారు. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పుష్పాలను అందించారు. పుష్పయాగం అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
ఇదీచదవండి.