ETV Bharat / state

ఒక వ్యక్తి నుంచి కరోనా 900 మందికి సోకుతుంది: డాక్టర్ మధు

ప్రస్తుతం ఏ దేశం చూసినా కరోనా విలయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. అసలు ఈ స్థాయిలో ఈ మహమ్మారి విజృంభిచటానికి కారణలేంటి? ప్రత్యేకించి భారత్​లో కరోనా తీవ్రత ఎలా ఉంది? చైనా తరహాలో మిగిలిన దేశాలు ఎందుకు కరోనాను కట్టడి చేయలేకపోతున్నాయి వంటి ప్రశ్నలపై... న్యూజిలాండ్​లో స్థిరపడిన తెలుగు వైద్యుడు ప్రముఖ యూరాలజీ ఆంకాలజిస్ట్ డాక్టర్.మధుతో ఆన్​లైన్​లో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది.

interview with newzealand doctors about spread of corona virus
కరోనాపై న్యూజిలాండ్ వైద్యులతో ముఖాముఖి
author img

By

Published : Apr 10, 2020, 6:04 PM IST

కరోనాపై న్యూజిలాండ్ వైద్యులతో ముఖాముఖి

కరోనా వైరస్ తీవ్రతను ప్రపంచ దేశాలు చాలా ఆలస్యంగా గుర్తించాయని... ఫ్లూ, ఇన్​ఫ్లూయెంజాల కన్నా అత్యంత వేగంతో కోవిడ్-19 మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తోందని ప్రముఖ యూరాలజీ ఆంకాలజిస్ట్ డాక్టర్. మధు తెలిపారు. ఒక పాజిటివ్ కేసు వ్యక్తి నుంచి నెలరోజుల్లో 900మందికి కరోనా వైరస్ సంక్రమిస్తోందని తెలిపారు. ప్రణాళిక లోపంతోనే కరోనా వైరస్ ఐరోపా, అమెరికా దేశాలను కుదిపేస్తోందన్నారు. యాంటీబాడీస్​పై జరుగుతున్న పరిశోధనలు కరోనా వైరస్ నియంత్రణకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. శరీరంలో ప్లాస్మాను బలోపేతం చేస్తేనే కరోనాను ఎదుర్కోగలమని వివరించారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్​లో ఉంచటం, ఐసోలేట్ చేయటం చిన్న విషయం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ నష్టపోయినా... కూలీలు, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని ఆయన అన్నారు.

కరోనా వైరస్ సోకితే 25-30 శాతం ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుందని... పాజిటివ్ కేసుల్లో పూర్తి స్థాయిలో ఊపిరితిత్తులు కోలుకోవటానికి 10-15 ఏళ్ల సమయం పడుతుందన్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలు ధైర్యంగా కరోనాను ఎదుర్కోవాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:

'అక్కడ పని చేసిన వైద్యులు....క్వారంటైన్​కు వెళ్లాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.