చిత్తూరు జిల్లా శాంతిపురంలో మండలం రెడ్లపల్లిలో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. వద్దుమడిలో దళిత కుటుంబానికి చెందిన నందకుమార్ అనే యువకున్ని రెడ్లపల్లికి చెందిన బాలిక ప్రేమ వివాహం చేసుకుంది. బాలిక చనిపోవటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రెడ్లపల్లిలో మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు. బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువకుడి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. మైనర్ బాలిక పరువు హత్యకు గురైందని దళిత సంఘాలు శాంతిపురంలో నిరసన వ్యక్తం చేశారు
పైవార్త పూర్వాపరాల కోసం- కులాంతర వివాహం చేసుకున్న వధువు మృతి..పరువు హత్యేనా..!