చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ సమీపంలో గతంలో రాజగోపురం కూలిన ఘటనలో నష్టపోయిన బాధితులకు...ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి 37మంది బాధితులకు వీటిని అందించారు. స్వామి సన్నిధికి సమీపంలోనే ఈ స్థలాలను కేటాయించారు. అలాగే ప్రభుత్వం తరపున పక్కా గృహాలను నిర్మించి... మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ...ప్రభుత్వ భూమి వదిలి.. ఎకరా రూ.70లక్షలకు క్రయం!