వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద అర్హులైన ప్రతీ చేనేత కార్మికుడికి నగదును అందించాలని కోరుతూ కార్మికులు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఉప పాలనాధికారి కార్యాలయం ఆవరణలో చేనేత కార్మికులు ఆందోళన చేశారు. గత సంవత్సరం పట్టణ శివారు ప్రాంతంలోని కోళ్లబైలు గ్రామంలో 4,60 మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరిందని... ఈసారి కేవలం 200 మంది మాత్రమే అర్హులుగా ఎంపిక చేశారని వాపోయారు.
ఒక ఇంటికి ఒకరిని మాత్రమే ఎంపిక చేయడం అన్యాయమని పేర్కొన్నారు. చేనేత కార్మికుడిగా గుర్తింపు పొందిన ప్రతీ ఒక్కరికి నగదు అందజేయాలని కోరారు. సర్వేలో జరుగుతున్న అవకతవకలను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం