చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. బుధవారం ఒక్కరోజే జిల్లాలో 819 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9,080కి చేరుకుంది. బుధవారం మరో ఏడుగురు కరోనాకు బలవ్వటంతో.. ఇప్పటి వరకు 95 మంది మరణించారు. 4,898 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా... 4,087 మంది చికిత్స పొందుతున్నారు.
తిరుపతిలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదు కావటంతో.. 14 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. దుకాణాలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 11 తరువాత రహదారులపైకి వాహనాలను, ప్రజలు అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తిరుమల బైపాస్ రోడ్డుకి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: హోమ్ ఐసోలేషన్‌కే కరోనా బాధితుల మొగ్గు