చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు 500 మార్క్ దాటేశాయి. ఒకే జిల్లాలో ఈ స్థాయిలో మరణాలు నమోదవటం రాష్ట్ర స్థాయిలోనే అత్యధికం. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మంది.. ఇతర అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకున్నవారూ ఉన్నారు. కేసుల విషయం చూస్తే.. జిల్లాలో కరోనా సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది.
ఒక రోజులోనే 968 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 46,469కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 504కి చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు చిత్తూరు జిల్లాలోనే నమోదవటం మహమ్మారి విజృంభణను స్పష్టం చేస్తోంది. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 37,218 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. మరో 8,747 మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: