ETV Bharat / state

అధికారుల వైఫల్యం.. రైతుల పాలిట శాపం

భూమి అవసరానికి ఆసరాగా ఉంటుంది. ఏదైనా కష్టం వస్తే ఆ భూమి అమ్ముకుని బయటపడేందుకు ఓ అవకాశం ఉంటుంది. కానీ అధికారులు చేసిన పొరపాట్లు ఆ ఊరి రైతులకు చిక్కులు తెచ్చిపెట్టాయి. ఉన్న భూమిని అమ్ముకోలేరు. కొత్తగా కొనుక్కోలేరు. ఇదీ ఊరి రైతుల పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యానికి ఆ గ్రామరైతులు నాలుగేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు.

అధికారుల వైఫల్యం.. రైతుల పాలిట శాపం
అధికారుల వైఫల్యం.. రైతుల పాలిట శాపం
author img

By

Published : Jun 6, 2020, 11:02 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండల ప్రభుత్వ అధికారుల వైఫల్యం రైతుల పాలిట శాపంగా మారింది. మండలంలోని కాప్పల్లె గ్రామంలో రైతులు తమ భూములు అమ్ముకోలేని, వేరొకరి భూమిని కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. కాప్పల్లె గ్రామంలో సర్వే నంబర్లను రెవెన్యూ అధికారులు రెండు భాగాలుగా విభజించారు.

ఈ భూములు ఆన్​లైన్​లో పొందుపరిచేటప్పుడు చేసిన తప్పిదంతో.. రైతులు భూమిని అమ్మాలన్నా.. కొనాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు కావడం లేదు. ఈ సమస్య గత నాలుగు సంవత్సరాలుగా ఉందని అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో లేదని చెప్పడంతో రైతులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

రాజకీయ వైరం.. కేసులతో ముదిరిన వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.