చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం కదిరీనాథునికోటలో దారుణ హత్య జరిగింది. ఇంటి ముందే వెంకటరమణ(45)ను ప్రత్యర్థులు నరికి చంపారు. గతంలో జరిగిన జంట హత్యల కేసులో వెంకటరమణ నిందితుడని స్థానిక సీఐ సురేశ్‌కుమార్ వివరించారు. ఘటనాస్థలిని ములకలచెరువు పోలీసులు పరిశీలించారు.
ఇదీ చదవండీ... శిరోముండనం కేసు.. తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం