హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీఎం స్పందిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని భాజపా నేతలు తిరుపతిలో అన్నారు. తిరుపతిలో జరిగిన భాజపా ఓబీసీ సమ్మేళనంలో పాల్గొన్న భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 120కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వరుస సంఘటనలు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
రామతీర్ధం ఘటనపై వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వామపక్ష నేతలు దేవుళ్లను రాతి విగ్రహలతో పోల్చడం సరైంది కాదన్నారు. ఏపీలో పాలన చేతకాకుంటే దేవదాయశాఖను ఎత్తివేసి హిందూ సంఘాలకు అప్పగించాలన్నారు. బీసీలందరూ ఐక్యమై తిరుపతి ఉపఎన్నికల్లో భాజపా - జనసేన అభ్యర్ధిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
'భాజపా కార్యకర్తలు రోడ్డెక్కితే.. జగన్ మూటాముల్లె సర్దుకోవాలి'