హిందువుల మనోభావాలను గాయపరిచేలా వైకాపా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భాజపా ఓబీసీ మోర్చా సమ్మేళనం నిర్వహించి.... పట్టణంలో ర్యాలీ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతమార్పిడులు పెరిగాయని... దేవాలయాలకు రక్షణ కరువైందని లక్ష్మణ్ విమర్శించారు. ఇదే రీతిలో కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
56 కులాలకు చైర్మన్లను ప్రకటించిన వైకాపా కేవలం వారిని కుర్చీకే పరిమితం చేసిందని దుయ్యబట్టారు. బీసీల అంటే ఓట్లు వేసే యంత్రంగా భావిస్తున్నారని... తిరుపతి ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఖండించాల్సిన కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్... భాజపాను విమర్శించడం తగదన్నారు.
ఇదీ చదవండి:
రామతీర్థం ఘటన.. దేశం మొత్తానికి జరిగిన అవమానం: సునీల్ దేవధర్