ETV Bharat / state

కేంద్ర నిధులు కాజేసేందుకు స్థానిక ఎమ్మెల్యే యత్నం: కోలా ఆనంద్ - chittoor district news

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి అందించే కేంద్ర ప్రభుత్వ నిధులను కాజేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని భాజపా నేత కోలా ఆనంద్​ ఆరోపించారు. ఇందులో భాగంగానే బాలాజీ నాయక్​​ నియామకం జరుగుతోందని అన్నారు.

kola anand
ఆ ఎమ్మెల్యే కేంద్రనిధులు కాజేశేందుకు కన్నేశారు
author img

By

Published : Jun 12, 2021, 7:44 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి అందించే కేంద్ర ప్రభుత్వ నిధులను కాజేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పథకం రచించారని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ ఆరోపించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించిన శ్రీకాళహస్తి ఎంపీడీవో బాలాజీ నాయక్​ను పురపాలక సంఘం కమిషనర్​గా నియమించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు.

రానున్న పురపాలక ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు ముందస్తు ప్రణాళిక ప్రకారం బాలాజీ నాయక్ నియామకం జరుగుతోందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలోకి వచ్చాక ఏకపక్ష నిర్ణయంతో 11 పంచాయతీలను పురపాలక సంఘంలో విలీనం చేసేందుకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కోలా ఆనంద్ హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Rape: 8 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం!

Peddi Reddy: 'గ్రామాల్లో మొక్కలు బతకకపోతే సర్పంచ్​లపై చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.