ETV Bharat / state

'ఓటర్లకు లడ్డూలు పంచడంపై తితిదే వివరణ ఇవ్వాలి' - తిరుమలలో భాజాపా అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి

వైకాపా ప్రభుత్వం ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తొండవాడలో ఓటర్లకు ఆ పార్టీ మద్దతుదారులు లడ్డూలు పంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్​ఈసీ ఈ విషయంపై స్పందించాలన్నారు.

bjp leader bhanu prakash reddy  talked on   ttd
భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి
author img

By

Published : Feb 20, 2021, 11:19 AM IST

అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయని భాజాపా అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాద వితరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో ఓటర్లకు లడ్డూలు పంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

రేషన్‌ పంపిణీ వాహనంలో వాలంటీర్లే లడ్డూలను పంచిపెట్టడంపై ఎస్‌ఈసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రసాదాల కోసం శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతుంటే... వేలాది లడ్డూలు ఇలా పక్కదారి పడుతున్నాయని మండిపడ్డారు. ఈ విషయంపైపై తితిదే స్పందించాలన్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో సెంచరీ కొట్టిన పెట్రోల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.