చిత్తూరు జిల్లా పచ్చారమాకులపల్లి తండా నుంచి ద్విచక్రవాహనంపై నాటుసారాను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు ఎక్సైజ్ సీఐ గురుప్రసాద్ తెలిపారు. నిందితుల్లో ఒకరు కడప జిల్లా మంగళంపల్లి గ్రామానికి చెందిన మారుతి ప్రసాద్, చిత్తూరు జిల్లా శివరామపురానికి చెందిన రమేష్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ ఎస్సైలు సుబ్రహ్మణ్యం, భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :