ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్ఎంయూ కార్మిక సంఘ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. సుమారు 46 డిమాండ్లతో కూడిన నోటీసును ఎండీ సురేంద్రబాబుకు అందించారు. కార్మికుల వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది కుదింపు, గ్రాట్యూటీ తగ్గింపు నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు. అద్దెబస్సుల పెంపు నిర్ణయాన్ని కూడా విరమించుకోవాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎన్ఎంయూ కార్మిక సంఘం నేత శ్రీనివాసరావు తెలిపారు. అర్టీసీకి చెల్లించాల్సిన 670 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈనెల 22 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి.