ETV Bharat / state

కంగారుపడొద్దు... అధికారం మనదే: చంద్రబాబు - L.V subramaniyam

మంత్రివర్గ సమావేశం అజెండాకు పరిమితమైంది. తమతమ జిల్లాల్లో ఉన్న తాగునీటి సమస్యపై మంత్రులు ప్రస్తావించారు. ఈ భేటీలో నీటిసరఫరా, పశుగ్రాసం, ఉపాధిహామీ నిధులపై సూచనలు చేసిన చంద్రబాబు... ఆర్‌టీజీఎస్‌ పనితీరును ప్రశంసించారు. జాతీయ రాజకీయాలు, ఎగ్జిట్ పోల్స్‌పై మంత్రులతో చంద్రబాబు చర్చించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : May 14, 2019, 8:25 PM IST

Updated : May 14, 2019, 9:01 PM IST

కంగారుపడొద్దు... అధికారం మనదే: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీని గందరగోళపరిచేలా ఎగ్జిట్​పోల్స్‌ వచ్చినా కంగారుపడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఎన్డీఏకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం వచ్చే అవకాశం కన్పించడం లేదన్న చంద్రబాబు... తెదేపా గెలుపుపై అనుమానమే లేదని స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలంలో జరిగిన మంత్రివర్గ భేటీలో సీఎం చంద్రబాబు సహచర మంత్రులతో తాజా పరిస్థితులపై చర్చించారు.

సమావేశంలో తమ జిల్లాల్లో ఉన్న తాగునీటి ఎద్దడిని మంత్రులు ప్రస్తావించగా... నీటిసరఫరా, పశుగ్రాసం, ఉపాధిహామీ నిధులపై సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. కొన్ని పథకాల్లో నిధుల లభ్యతలో ఇబ్బంది వస్తోందన్న పలువురు మంత్రులు చెప్పగా... మరో 10 రోజులు ఆగాలని, ప్రస్తుతం అజెండాకే పరిమితం అవుదామని చంద్రబాబు బదులిచ్చారు.

తుపానులను ముందే అంచనావేసి నష్టనివారణ చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు తెలిపారు. ఈ సందర్భంగా... ఆర్‌టీజీఎస్‌ పనితీరును మంత్రివర్గం ప్రశంసించింది. మంత్రివర్గ భేటీకి ముందు మంత్రులందరితో కరచాలనం చేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం... భేటీలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

జాతీయ రాజకీయాలపై మంత్రులతో చర్చ...
జాతీయ రాజకీయాలు, ఎగ్జిట్ పోల్స్‌పై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో మోదీపై వస్తున్న వ్యంగ్యాస్త్రాలను ప్రస్తావించారు. ప్రధానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అంశాలు మంత్రి సోమిరెడ్డి వివరించారు. మోదీ విధానాలను జాతీయస్థాయిలో పూర్తిగా ఎండగట్టలేకపోయారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ కూటమికి అధికారం రాదని... ఒకవేళ వచ్చినా మోదీని తప్పిస్తారనే ప్రచారం జరుగుతోందన్న ఓ మంత్రి పేర్కొన్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ లేదా గడ్కరీకి అవకాశం వస్తుందని మరో మంత్రి అన్నారు.

sample description
Last Updated : May 14, 2019, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.