ETV Bharat / state

Tallapaka Convert Tourist Center: అభివృద్ధికి దూరంగా అన్నమయ్య తాళ్లపాక గ్రామం.. 'టీటీడీ దత్తత ఉత్తదేనా..!' - 108 feet Annamayya statue at Boinapally

Tallapaka Convert Tourist Center: పద కవితా పితామహుడు అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రాసి వేంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు. తన భక్తి కీర్తనలతో తెలుగుజాతిని భక్తి రసంలో ఓలలాడించాడు. మొట్టమొదటి తెలుగు వాగ్గేయకారుడిగా ప్రసిద్ధికెక్కాడు అన్నమయ్య.. ఇంతటి ప్రాశస్థి కలిగిన అన్నమయ్య స్వగ్రామం తాళ్లపాక గ్రామాన్ని అటు ప్రభుత్వం ఇటు టీటీడీ అధికారులు అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tallapaka_Convert_Tourist_Center
Tallapaka_Convert_Tourist_Center
author img

By

Published : Aug 15, 2023, 7:17 PM IST

Updated : Aug 15, 2023, 7:45 PM IST

Tallapaka Convert Tourist Center : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య రాయలసీమ ప్రాంతంలోని తాళ్లపాక గ్రామంలో 1408 సంవత్సరంలో నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు జన్మించాడు. అన్నమయ్య జిల్లా తాళ్లపాక గ్రామాన్ని 1980లో టీటీడీ దత్తత తీసుకున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయట్లేదని గ్రామస్థుల ఆరోపిస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి అన్నమయ్య జయంతి, వర్ధంతి, బ్రహ్మోత్సవాలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారని, ఆలయ అభివృద్ధికి గ్రామాభివృద్ధికి ఎలాంటి సహకారాలు అందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tallapaka Convert Tourist Center

Thallapaka Village Not Seen Development in Rajampet : 2008 సంవత్సరంలో చైర్మన్​గా ఎన్నికైన భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో అంగరంగ వైభవంగా తాళ్లపాకలో అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లడం జరిగింది. తర్వాత వచ్చిన అధికారులు నామమాత్రంగా చేశారే తప్ప ఇటువంటి అభివృద్ధి తాళ్లపాక నోచుకోలేదన్నారు. ఇప్పుడు రెండవసారి చైర్మన్​గా ఎన్నికైన భూమన కరుణాకర్ రెడ్డి Bhoomana Karunakar reddy గ్రామానికి అన్నమయ్యకు అభివృద్ధి చేస్తారని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

తాళ్లపాక గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోయినపల్లిలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాచార్య ఉద్యానవనం ఏర్పాటు చేశారు. ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించారు. కానీ ఇందులో నీటి సౌకర్యం లేదు నిర్వహణ సరిగ్గా లేదు. పరిసరాలు చెత్త చెదారంతో నిండిపోయాయి. సాయంత్రం పూట పాములు తిరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్థులు వాపోయారు.

తిరుమలలో తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతి
తాళ్లపాకలో నిర్మించవలసిన వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాచార్యుల విగ్రహం కొందరు తమ వ్యాపార ప్రయోజనాల కోసం తాళ్లపాకకు సంబంధంలేని బోయినపల్లిలో నిర్మించాలని తాళ్లపాక గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులుTTD officials తాళ్లపాక అన్నమయ్య జన్మించిన స్వస్థలానికి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. దయచేసి ఏమి డెవలప్మెంట్ చేసిన మా గ్రామంలోని జరగాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. ఇక్కడ పొలం ఉందని.. దానిని కోనేరుగా చేయొచ్చని, సింహద్వారం పెట్టొచ్చని, ఇవేమీ పట్టించుకోకుండా అన్నమయ్యను నిర్వీర్యం చేస్తున్నారని గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 32000 సంకీర్తన రాసిన అన్నమయ్యకు జ్ఞానోదయం అయ్యింది ఇక్కడే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి నేర్చుకోలేదని, వచ్చిన భక్తులకు లైబ్రరీ వసతి గృహాలు, తాగునీరు, ఏర్పాటు చేయాలని వారు కోరుకుంటున్నారు.

తాళ్లపాక గ్రామంలో అన్నమయ్య పూర్వీకులు ఆరాధించిన చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోనే అన్నమాచార్యులకు జ్ఞానోదయం అయ్యిందని అన్నమాచార్యునికి చెన్నకేశవ స్వామి కలలో కనిపించి నాలుకపై బీజాక్షరాలు రాశాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సమీపంలోనే కామాక్షి దేవి సమేత సిద్దేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో రావి, మర్రి, జమ్మి వృక్షాలు కలిసి ఉన్నాయి. వీటి చుట్టూ ప్రదక్షిణ చేస్తే దోష పరిహారం అవుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం.

ఎంతో ప్రశస్తి కలిగిన ఈ ప్రాంతాన్ని ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి తాళ్లపాక గ్రామాన్ని అభివృద్ధి పరచాలని గ్రామానికి వచ్చే దారిలో ఉన్న చెరువును మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి పరచి గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. ఇకనైనా గ్రామానికి సంబంధించిన అన్ని సదుపాయాలు భక్తులకు కల్పించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

తాళ్లపల్లిలో అన్నమయ్య వర్ధంతి.. ఆకట్టుకున్న సంకీర్తన గోష్టి

Last Updated : Aug 15, 2023, 7:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.