అనంతపురం జిల్లా మడకశిర మండలం ఆర్.అనంతపురం గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజుల అయినా కుళాయి నుంచి చుక్క నీరైనా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించటంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు సర్దిచెప్పడంతో ఆందోళనను విరమించారు.
ఇది చూడండి: ఆ పల్లెల్లో.... నిద్రలోనూ తుపాకీ శబ్దమే వినిపిస్తోంది!