అనంతపురంలోని నగర శివారు టీవీ టవర్ సమీపంలో లక్ష్మీదేవి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. బుడ్డప్పనగర్ కు చెందిన లక్ష్మీదేవి టీవీ టవర్ సమీపంలో తన కొడుకు కొత్త ఇంటిని నిర్మాణం చేపడుతుండగా.. రాత్రి సమయంలో ఆమె కాపలాగా ఉండేది. అయితే సోమవారం అర్ధరాత్రి పక్కింట్లో చోరీ చేయడానికి వచ్చిన దొంగలను ఆమె చూడటంతో.. దొంగలు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని, చోరీ జరిగిన ఇంటిని డాగ్ స్క్వాడ్ తో పోలీసులు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ పడకలు పెంచేందుకు సర్కార్ కసరత్తు