అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి. హీరేహాళ్ మండలం ఓబుళాపురం గ్రామ సచివాలయాన్ని(obulapuram village secretariat) ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు సందర్శనకు రాగా.. అప్పటికే సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది(staff) తాళం వేసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం(angry) వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయ పాలన పాటించకుండా గ్రామ సచివాలయం భవనం మూసివేయడంపై మండిపడ్డారు.
మధ్యాహ్నం మూడున్నర గంటలకే సచివాలయానికి తాళం వేసి వెళ్లిపోవడంపై విప్ కాపు రామచంద్రారెడ్డి.. సచివాలయ ఉన్నతాధికారులతో చరవాణిలో మాట్లాడారు. ప్రభుత్వ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిపై వెంటనే చర్యలు(act on neglegence) తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు శాతం పరిశీలించారు.
ఇదీచదవండి.