ఇవీ చూడండి..
ఫౌంటెన్‌ను తలపించిన.. వాల్వు పైప్‌లైన్ లీకేజ్ - ఈరోజు అనంతపురం జిల్లాలో పైప్ లైన్ లీక్ న్యూస్ అప్ డేట్
శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం పైప్ లైన్‌కు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా నీళ్లు ఎగసిపడ్డాయి. దీంతో ఆ దృశ్యం ఫౌంటెన్‌ను తలపించింది. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా వీక్షించారు.
ఫౌంటెన్ ను తలపిస్తున్న వాల్వు పైప్‌లైన్ లీకేజ్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో కంబదూరు బైపాస్ సమీపంలో శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం పైప్ లైన్‌కు గండిపడింది. పైప్‌లైన్‌కు గండి పడటంతో నీరు భారీగా నీరు వృథా అవుతోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు పెన్నా అహోబిలం రిజర్వాయర్ నుంచి నీరు వెళ్లే ఈ పైపులైను తరచూ ఇలా మరమ్మతులకు గురవుతోంది. అధికారులు మరమ్మతుల కోసం పక్కనే ఉన్న వాల్వును తెరిచారు. ఆ సమయంలో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. లీకైన పైప్‌లైన్ నుంచి నీరు ఎగసిపడుతుండటంతో.. ఫౌంటెన్‌ను తలపించింది. ఇది చూసేందుకు రోడ్డుపై ప్రయాణించేవారు, పొలాల్లోని రైతులు ఆసక్తి కనబరిచారు.
ఇవీ చూడండి..
వ్యవసాయశాఖకు కత్తిమీద సాములా వేరుశనగ విత్తన సేకరణ