ETV Bharat / state

ఉపాధి పథకం.. ఉద్యాన పథం

రైతుకు నిరంతర ఆదాయం అందించే విధంగా పండ్ల తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. జూన్‌లో ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులకు మొక్కల పెంపకానికి అనుమతి మంజూరు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

upadhi hami scheme
upadhi hami scheme
author img

By

Published : Jun 18, 2020, 6:53 AM IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు చెప్పగానే చెరువు పనులే గుర్తుకు వస్తాయి. ఏడాదిలో ఎన్ని రోజుల పని ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం పండ్ల తోటల పెంపకానికి చర్యలు చేపట్టింది. రైతుకు నిరంతర ఆదాయం అందించే విధంగా పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించింది. గత కొంతకాలంగా ఈ పథకం ప్రభుత్వం చేపట్టక పోవడంతో రైతులు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ ఏడాది జూన్‌లో ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులకు మొక్కల పెంపకానికి అనుమతి మంజూరు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. గుంతలు తీసింది మొదలు మొక్కలు నాటడం నుంచి మూడేళ్ల వరకూ సంరక్షణ, నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం కూలీలకు చెల్లించే మొత్తం కలుపుకొని రూ.2లక్షల చెల్లించనుండటంతో రైతులు పండ్ల మొక్కల పెంపకానికి ముందుకు రావాలని అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు అనుమతి మంజూరు చేస్తున్నారు.

లక్ష్యం 30 వేల ఎకరాలు

జిల్లాలో ప్రభుత్వం 15వేల ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచాలని లక్ష్యాలను నిర్ధేశించగా అధికారులు 30 వేల ఎకరాల్లో పెంపకానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే 15వేల మొక్కల పెంపకానికి అనుమతులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. జూన్‌ చివరికి మిగిలిన 15 వేల ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడానికి కార్యాచరణ రూపొందించారు. రైతులకు సుస్థిర ఆదాయాన్ని అందించేందుకు డ్వామా చురుగ్గా చర్యలు చేపట్టింది. వీలైనంత వేగంగా మొక్కలను సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. గుంతలు తీసిన వారికి మొక్కలు తెప్పించే చర్యలు చేపట్టారు.

మొక్కలు ఇవే..

పండ్ల తోటల పెంపకంలో భాగంగా మామిడి, జామ, సపోటా, అల్లనేరేడు, చింత, చీనీ మొక్కలు నాటిస్తారు. మామిడి అయితే ఎకరానికి 70, చీని, జామ ఇతర మొక్కలు ఎకరానికి 100, సపోటా 60, నేరేడు 40, చింత 40 మొక్కలు ఇస్తారు. వీటిని నేరుగా రైతులకు అందజేస్తారు.

నగదు మంజూరు ఇలా....ఎవరు అర్హులు అంటే

ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మెట్ట రైతులయితే ఐదెకరాల లోపు, మాగాణి రెండున్నర ఎకరాలు ఉన్న రైతులు పండ్ల మొక్కల పెంపకానికి అర్హులు. కుటుంబం యూనిట్‌గా తీసుకుని ఐదు ఎకరాల లోపు భూమికి మాత్రమే వర్తిస్తుంది. మొక్కలు నాటేందుకు ఉపాధి కూలీలతో గుంతలు తీయిస్తారు. మొక్కలు రైతులు కొనుగోలు చేస్తే మొక్కలకు అయ్యే ఖర్చును రైతుకు, ప్రభుత్వం సమకూరిస్తే ప్రభుత్వానికి చెల్లిస్తారు. మొక్కలకు నీరు, కాపలా, ఎరువులు, కలుపు, జీవ కంచెల ఏర్పాటు, సంరక్షణ కింద ఏటా రూ.1.25 లక్షల వరకు మూడేళ్ల పాటు చెల్లిస్తారు. వర్షాకాలం మినహా మిగిలిన ఏడాదిలో మొక్కకి నెలకు రూ.15, నెలలో నాలుగు దఫాలు నీరు పోస్తే రూ.4.16 చెల్లిస్తారు. ఒకసారి ఎకర పొలం దున్నేందుకు రూ.1000, ఎరువులకు రూ.1500 ఇస్తారు. చెల్లింపులు 100 మొక్కలు నాటితే రెండో ఏట అడుగు పెట్టే సమయానికి 75 శాతం మొక్కలు బతికుండాలి, మూడో ఏటకు వచ్చే సరికి 90 శాతం మొక్కలు బాగుండాలి. 75 శాతం లోపు మొక్కలకు మాత్రమే నిర్వహణ ఖర్చులు చెల్లిస్తారు. చనిపోయిన వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటుకునేందుకు అవకాశం ఉంటుంది.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి హామీ పథకం కింద పండ్ల మొక్కల పెంపకం రైతులకు ఎంతో ఉపయుక్తం. ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలి. పథకం ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఈనెలాఖర్లోగా 30 వేల ఎకరాల్లో వివిధ రకాల పండ్ల మొక్కల పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. - ప్రసాద్‌బాబు, పీడీ డ్వామా

ఇదీ చదవండి: ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.