శ్రీలంకలో జరిగిన ముష్కరుల బాంబు పేలుళ్ల నుండి తాము, తమ స్నేహితులు సురక్షితంగా బయటపడ్డామని అనంతపురం జిల్లా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్ర బాబు తెలిపారు. అక్కడ జరిగిన భయానక సంఘటన గురించి మీడియాకు వివరించారు.
సంఘటన జరిగిన సమయంలో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోయామని అన్నారు.పేలుళ్ల అనంతరం హోటల్ సిబ్బంది తమకు అన్ని విధాలుగా సహాయపడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, తమతో ఫోన్లో మాట్లాడి జిల్లాకు తిరిగి రావడానికి సహాయపడ్డారని అన్నారు.