అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏడు మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో కారులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 24 మద్యం బాటిళ్లతో పాటు 2 ఐచర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇండికా కారులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 31 మద్యం బాటిళ్లను తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం, ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సభ్యులను నియమించిందని అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో విజయ్ కుమార్ తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి