ప్రస్తుతం రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని కళ్యాణదుర్గం తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాస్తవిక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన పేర్కొన్నారు. తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్ట్‌కు నిరసనగా కళ్యాణదుర్గం తెదేపా కార్యాలయం నుంచి నల్ల జెండాలతో స్థానిక అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ ఆగడాలను ఎండగడతామని ఆయన హెచ్చరించారు.
'వైకాపా ప్రభుత్వ ఆగడాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం'
తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కళ్యాణదుర్గం తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తంచేశారు.