అనంతపురం జిల్లా యల్లనూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యక్తిగత పనుల కోసం యల్లనూరుకు వెళ్లిన ఆయన...తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి హడావుడి చేశారు. ఎమ్మార్వో కుర్చీలో కూర్చొని.. ఆలస్యంగా వచ్చిన అధికారులపై మండిపడ్డారు. తన నియోజకవర్గం కాకపోయినా వెళ్లి మేజిస్ట్రేట్ హోదా అయిన తహసీల్దార్ కుర్చీలో కూర్చోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: గ్రామ సచివాలయాలే రిజిస్ట్రార్ కేంద్రాలు: సీఎం జగన్