పేదలకు ఇంటి స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఇళ్ల స్థలాల సేకరణలో భాగంగా పేదల నుంచి భూములు లాక్కోవటం, అర్హులకు కాకుండా అనర్హులకు ఇంటి స్థలాలను మంజూరు చేయటం వంటి ఆరోపణలు ప్రతిచోట వినిపిస్తూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో ఉగాది పండుగకు నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే వాలంటీర్లు ఎంపిక చేసిన అర్హులకు ఇంటి స్థలాలు ఇవ్వకపోగా.. చనిపోయిన వారికి ఇంటి స్థలాలను కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాము ఎంపిక చేసిన అర్హులకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే ఎలా ప్రజల్లోకి వెళ్లాలని వాలంటీర్లు తహసీల్దార్‌ను ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిన వారి పేర్లు కూడా ఇంటి పట్టాల అర్హుల జాబితాలో ఉన్నాయని వాలంటీర్లు, వైకాపా నేతలు మండిపడ్డారు.
ఇవీ చూడండి...