ETV Bharat / state

'అందుకే పంటబీమా అందలేదు'.. రైతులకు ఎమ్మార్వో నిర్లక్ష్యపు సమాధానం !

author img

By

Published : Jun 19, 2022, 5:38 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో.. పంటబీమా అందని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మార్వో.. రైతులకు నిర్లక్ష్యపూరిత సమాధానం ఇచ్చారు. ఈ-కేవైసీ చేసుకోకపోవటంతోపాటు డబుల్ ఎంట్రీ చేసుకోవటంతో రైతులకు పంట బీమా అందలేదని చెప్పారు.

రైతులకు ఎమ్మార్వో నిర్లక్ష్యపు సమాధానం
రైతులకు ఎమ్మార్వో నిర్లక్ష్యపు సమాధానం

అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో పంట బీమా అందని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక "స్పందన" కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తహసీల్దార్ మారుతి, వ్యవసాయశాఖ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ-క్రాప్ బుకింగ్ చేసుకున్నప్పటికీ పంట బీమా అందలేదని రైతులు అధికారుల ఎదుట వాపోయారు. మరి కొందరు రైతులు తమకు భూములున్నా.. భూమి లేదని రికార్డుల్లో నమోదైందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా.. పంట బీమా అందలేదని ఆందోళన చెందుతున్న రైతులకు.. అధికారులు నిర్లక్ష్యం సమాధానం చెప్పారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఈ-కేవైసీ చేసుకోలేదని, డబుల్ ఎంట్రీ చేసుకోలేదని అందుకే.. పంట బీమా అందలేదని తహసీల్దార్ మారుతి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని అన్నదాతలు వాపోయారు. ఈ-కేవైసీ కానీ రైతులకు పంట బీమా దక్కదని అధికారులు చెప్పడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.