అనంతపురం జిల్లా తాడిమర్రి సాయిబాబా గుడి సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఐషర్ వాహనం పట్టుబడింది. వాహనంలో 126 బియ్యం బస్తాలున్నాయి. వాటిని కర్ణాటకకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు రేషన్ బియ్యం అప్పగించనున్నట్లు తాడిమర్రి ఎస్ఐ శ్రీ హర్ష తెలిపారు.
ఇవీ చదవండి: బసినేపల్లి సమీపంలో 2,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం