అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంతో పాటు పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల ఉష్ణోగ్రతలు అధికమై ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఉరుములతో కూడిన వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇలాంటి వర్షాలు ఒకటి రెండు సార్లు పడితే వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటాయని, పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పలువురు రైతులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...