ETV Bharat / state

Protests in Ananthpur Against CBN Arrest: అనంతలో రగిలిన నిరసన జ్వాలలు.. అరగుండు చేయించుకుని ఆందోళన - స్కిల్​ డెవలప్​మెంట్​ కేసు

Protests Across the State Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ టీడీపీ నేతల నినాదాలు హోరెత్తాయి. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వచ్చి రానున్న ఎన్నికల్లో సీఎం అవుతారని దీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా అనంతరం జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగించారు.

protests_across_the_state
protests_across_the_state
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 8:30 PM IST

Updated : Sep 23, 2023, 9:12 PM IST

Protests Across the State Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ అనంతరం జిల్లా కళ్యాణదుర్గంలో ఐదు మంది తెలుగు యువత ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్లో గతవారం నుంచి మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కుమారుడు మారుతి చౌదరి మరో నలుగురితో పాటు నిరావధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు టీడీపీ కార్యకర్తలు సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తమ అధినేత పట్ల అవలంబిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు.

TDP leaders met Nara Bhuvaneshwari నారా భువనేశ్వరీ, బ్రహ్మణీతో భేటీ అయిన సీనియర్ టీడీపీ నేతలు.. వైసీపీ నేతలకు జైళ్ళు సరిపోవు

Women Protest in Anantapur: అక్రమ అరెస్టు చేసిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని అనంతపురంలో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనగర్ కాలనీలోని సిరి బృందావన్ అపార్ట్మెంట్లో మహిళలు బయటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కృషిచేసిన, స్కిల్ డెవలప్మెంట్(skill development) ద్వారా యువతకు ఉపాధి కల్పించిన వ్యక్తిని ఇలా అక్రమ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును గృహణీలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అవినీతి అరాచక పాలన ప్రజలు గమనిస్తున్నారు.. ఆయనకు త్వరలో సమాధానం చెబుతారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలంతా ఏకమై చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని చెప్పారు. చంద్రబాబును విడుదల చేసే వరకు పోరాడుతామని తెలిపారు.

Motkupalli on Chandrababu Arrest : 'ముష్టి రూ.300 కోట్లకు చంద్రబాబు ఆశపడతారా?.. జైల్లో ఆయనకేదైనా జరిగితే జగన్‌దే బాధ్యత'

Expressed his Protest by Shaving Half his Head: కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు సమక్షంలో కుందుర్పి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు హనుమంతరాయుడు అర గుండు గీయించుకుని తన నిరసనను వ్యక్తం చేశాడు. పార్టీ కార్యక్రమంలో చురుగ్గ పాల్గొనే దళిత నాయకుడు హనుమంతరాయుడు తమ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరం వద్ద అర గుండు గీయించుకుని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టడంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వం ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

NRIs agitation against CBN Arrest: చంద్రబాబు అరెస్టుపై ఎన్​ఆర్​ఐల ఆగ్రహం.. టాంజానియాలో క్యాండిల్ ర్యాలీలు..

TDP and CPI Leaders Protest: రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూసి న్యాయవ్యవస్థ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ, సీపీఐ నాయకులు చెప్పారు. చంద్రబాబుకు మద్దతుగా అనంతపురంలోని రామ్ నగర్​లో టీడీపీ, సీపీఐ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబును అరెస్టు(Chandrababu Arrest) చేసి నియంత పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. చంద్రబాబును విడుదల చేసే వరకు టీడీపీతో పాటు సీపీఐ ఆందోళనలు ఉదృతం చేస్తుందని తెలిపారు.

Protests in Ananthpur Against CBN Arrest: అనంతలో రగిలిన నిరసన జ్వాలలు

Last Updated : Sep 23, 2023, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.