Power cut in DEO office: అనంతపురంలోని కమలానగర్లో ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గత 24 గంటలుగా చీకట్లోనే డీఈఓ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు రూ .3.86 లక్షల విద్యుత్ బకాయిలను విద్యాశాఖ అధికారులు చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది. సాయంత్రం వేళలో డీఈఓ కార్యాలయానికి వచ్చిన విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. పెండింగ్ బిల్లులను చెల్లించకపోవడమే కాక విద్యుత్ శాఖ అధికారులకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం నుంచి డీఈఓ కార్యాలయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో సెల్ ఫోన్ లైట్ వేసుకొని అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి : రవాణాశాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్య...నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు