అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలో ఎస్ఈబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎం. కొత్తూరు సమీపంలోని ఓ మామిడితోటలో నిల్వఉంచిన 8352 కర్ణాటక మద్యం ప్యాకెట్లను పట్టుకున్నారు. మామిడి తోటను లీజుకు తీసుకున్న శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ చేసి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించామని సీఐ హరికృష్ణ తెలిపారు. ఈ దాడిలో సుమారు మూడు లక్షల రూపాయల విలువైన 8,352 కర్ణాటక మద్యం టెట్రా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళను అదుపులోకి తీసుకున్నామని.. ప్రకాష్, చిరంజీవి అనే మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని వారు తెలిపారు.
ఇదీ చూడండి.: తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కొవాగ్జిన్ టీకాలు