అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రైల్వే కాలనీలో జరిగిన కిడ్నాప్ ఘటనను కేవలం 4 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన గుంతకల్లు తెదేపా మాజీ కౌన్సిలర్ సంజీవ్‌తో పాటు ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి కిడ్నాప్‌నకు ఉపయోగించిన ఒక స్కార్పియో వాహనంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అరెస్ట్ చేసిన వారిపై 324, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. కిడ్నాపర్లు ఎక్కువగా కొట్టటంతో రక్త స్రావం అవుతుండటంతో వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించామన్నారు.
అసలేం జరిగిందంటే...
శ్యామల, శ్రీనివాసరావు భార్య భర్తలు... శ్యామల భర్తతో గొడపడి సోదరుడు సంజీవ్ ఇంటికి వెళ్లింది.. ఈ విషయంపై సంజీవ్.. తన బావమరిది శ్రీనివాసరావుని దుర్భాషలాడాడు. ఎంతకీ మాట వినకపోయే సరికి సంజీవ్ తన బావమరిది శ్రీనివాసరావును, పక్కనే ఉన్న కిషోర్ అనే వ్యక్తిని చితకబాది తన అనుచరులతో కలిసి కారులో ఎక్కించుకుని వెళ్లాడు. ఈ ఘటన చూసిన స్థానికులు శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.. వెంటనే... శ్రీనివాసరావు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక ఎస్సైతో బృందంగా ఏర్పడి కారును ట్రేస్ చేసి పట్టుకున్నామని సీఐ తెలిపారు.
ఇదీ చూడండి