ఇవీ చూడండి.
పుట్టపర్తిలో పల్లె కోసం కోడలి సింధు ప్రచారం - పల్లె సింధూ
పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని... పల్లె రఘునాథ రెడ్డి విజయానికి సహకరించాలని కోరుతూ కోడలు సింధు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి అందర్నీ పలకరిస్తూ... సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు.
పుట్టపర్తిలో మామ తరపున కోడలు ప్రచారం చేసిన పల్లె సింధు
తెదేపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తన మామను గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు పల్లె సింధు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి తరఫున కోడలు సింధు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం పథకాలను ప్రజల చెంతకు తీసుకెళ్లి, నిత్యం ప్రజలతో ఉంటున్నపల్లె రఘునాథరెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నారు. ప్రతిసారీ ప్రచారంలో రఘునాథరెడ్డి భార్య పాల్గొనేవారని... ఆమె మరణంతో ఇప్పుడు కోడలు రంగంలోకి దిగారు. మామగెలుపు బాధ్యత తీసుకున్నారు.
ఇవీ చూడండి.
sample description