ETV Bharat / state

8 రోజుల తర్వాత కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటిద్దామనుకుంటే... - అనంతపురం జిల్లా తాజా వార్తలు

చనిపోయన వ్యక్తికి పాజిటివ్ అని తేలడంతో.... కుటంబానికి పరీక్షలు చేయగా వారికి కరోనా సోకింది. అయితే వారితో కాంటాక్ట్​లో ఉన్న వారికి పరీక్షలు చేశారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్ వచ్చిందని కొవిడ్ ఆసుపత్రిలో చేర్చారు. కానీ వారు నివాసముంటున్న ప్రాంతాన్ని కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించడం మరిచారు. ఎనిమిది రోజుల తరువాత చేయాలని అనుకున్నారు. కానీ!

officers  Neglected in the declaration of the containment zone at gandhibazar, ananthapur district
అనంతపురం జిల్లా గాంధీబజార్​ని కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించాలనుకున్న అధికారులు
author img

By

Published : Jul 2, 2020, 6:24 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో కరోనా సోకిన వ్యక్తి మృతిచెందాడు. అతని కుటుంబీకులను క్వారంటైన్ తరలించి పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా... వారితో కాంటాక్ట్​లో ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురుకి పాజిటివ్ అని తేలింది. వీరిని అనంతపురం కోవిడ్ ఆసుపత్రికి తరలించిన 8 రోజులైంది. ఇప్పుడు వారుంటున్న గాంధీబజార్ ప్రాంతాన్ని కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. వైరస్​ ఉందని తెలియగానే చేయాల్సిన పనిని... అధికారులు 8 రోజుల తరువాత చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఇంత నిర్లక్ష్యం తగదంటూ మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 845 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.