ETV Bharat / state

కంటైన్​మెంట్ జోన్​లో వైద్య సేవల పట్ల అలసత్వం

ఓ పక్క కరోనా ఉద్ధృతి ఎక్కువుగా ఉన్నా... అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. కంటైన్​మెంట్ జోన్​లో ఉంటున్న ప్రజలకు మందులు అందించేందుకు వచ్చే ఏఎన్​ఎం సరైన సమయానికి రాక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

negligence in containment zones
కంటైన్​మెంట్ జోన్​లో వైద్య సేవల్లో అలసత్వం
author img

By

Published : Jul 15, 2020, 5:08 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కంటైన్​మెంట్ జోన్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అటువంటి ఈ జోన్లలో వైద్య సేవలు అందించే ఏఎన్ఎం సమయానికి రాకపోవటంతో ప్రజలు విమర్శిస్తున్నారు. మడకశిర గాంధీబజార్ కంటైన్​మెంట్ జోన్​లో ఉదయం పదకొండు అయినా ఏఎన్ఎం రాకపోవడంతో మందుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: తన తండ్రి మొదలుపెట్టిన పావలా వడ్డీ పథకాన్నే జగన్ ఆపేస్తారా?..: సోమిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.