మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అనంతపురం జిల్లా వైకాపా నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి జిల్లా మంత్రి శంకరనారాయణతోపాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ అభ్యర్థులు, ప్రచారం, గెలుపు వ్యుహాలపై చర్చించారు. అలాగే కొన్నిచోట్ల రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటంపై సమాలోచనలు చేశారు. వారిని పోటీ నుంచి తప్పించడంపై సూచనలు చేశారు. పార్టీ సమావేశానికి వచ్చిన బొత్స సత్యనారాయణను... కొవిడ్ సమయంలో సేవలందించిన ఎఎన్ఎమ్లు కలిశారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
ప్రజలకు తాగునీటి పన్నును 40 శాతం నుంచి వంద శాతం పెంచటానికి చంద్రబాబునాయుడు 2018లో జీఓ ఇచ్చారో లేదో చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. ప్రజలు ఇంతపెద్ద మెజారీటీ ఇచ్చిన పరిస్థితులు తానెప్పుడూ చూడలేదన్న ఆయన... జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే మేలు జరుగుతుందని భావించటం వల్లే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తున్నారని తెలిపారు.
పోలీసులు చెప్పినప్పటికీ...
ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రచారానికి అనుమతి ఇస్తామని, ఆందోళనలు కుదరదని పోలీసులు తెలిపినప్పటికి... చంద్రబాబునాయుడు వినకుండా వెళ్లి ఎయిర్ పోర్టుల్లో కింద కూర్చొని యాగీ చేశారని సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నామనే విషయం మరిచిపోయి మేనిఫెస్టో విడదల చేసి పన్నులు తగ్గిస్తామని చెప్పటం ప్రజలను మోసం చేయటానికేనని ఆయన ఆరోపించారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధులతో ఇరువురు నేతలు పుట్టపర్తిలో సమావేశం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండీ.: