అనంతపురం జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్‌ను.. విద్యార్థి సంఘాల నాయకులు(Minister Botsa satyaranayana convoy blocked by student leaders) అడ్డుకున్నారు. కలెక్టరేట్లో సమీక్షా సమావేశం అనంతరం వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌కు.. విద్యార్థి సంఘాల నేతలు అడ్డుపడ్డారు.
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని.. రోడ్డుకు అడ్డంగా పడుకొని కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు సమస్యలను పరిష్కరించాలని.. వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆందోళన చేపట్టారు.
కాలయాపన కోసమే ఈ సమీక్షలు చేస్తున్నారని.. ప్రజాసమస్యలను నిజంగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి మూడేళ్లవుతున్నా.. ఇంతవరకు అక్కడ ఎలాంటి వసతులు సౌకర్యాలు లేవని నాయకులు విమర్శించారు. పోలీసులు అప్రమత్తమై విద్యార్థి సంఘ నాయకులను పక్కకు తీసుకువెళ్లారు.
ఇదీ చదవండి:
TDP PARLIAMENTARY PARTY MEETING: 'రాష్ట్రంలోని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి'