కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం తీసుకువస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు మద్యం పట్టుకున్నారు. బళ్లారి నుంచి తీసుకువస్తున్న 141 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ సుమారు రూ.51,660 ఉంటుందని పోలీసులు తెలిపారు. గత మూడు నెలల్లో 68 మందిపై కేసులు నమోదు చేసి... మద్యం తరలించేందుకు వినియోగిస్తున్న వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు.
అనంతపురంలో మద్యం పట్టివేత - అనంతపురం తాజావార్తలు
విడపనకల్ మండలంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద 141 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా రాష్ట్రానికి మద్యం తరలిస్తున్న వారిని అరెస్టు చేశారు.